Posted in

Lord Ganesh Song Lyrics

Lord Ganesh Song Lyrics
Lord Ganesh Song Lyrics

Vakratumda mahaakaaya – వక్రతుమ్ద మహాకాయ

 

వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభా

నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

జయ జయ శుభకర వినాయక

శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక

జయ జయ శుభకర వినాయక

శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక

ఆ ఆ ఆ ఆ

బాహుదానదీ తీరములోన బావిలోన వెలసిన దేవ

మహిలో జనులకు మహిమలు చాటి ఇహపరములనిడు మహానుభావా

ఇష్టమైనది వదలిన నీకడ ఇష్టకామ్యములు తీర్చే గణపతి

కరుణను కురియుచు వరముల నొసగుచు నిరతము పెరిగే మహాకృతి

సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి

నీ గుడిలో చేసే సత్య ప్రామాణం ధర్మ దేవతకు నిలపును ప్రాణం

విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం

జయ జయ శుభకర వినాయక

శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక

జయ జయ శుభకర వినాయక

శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక

పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు

మాతా పితలకు ప్రదక్షిణముతో మహా గణపతిగా మారావు

భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు

బ్రహ్మాండము నీ బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు

లాభము శుభము కీర్తిని కూర్వగ లక్ష్మీ గణపతివైనావు

వేదపురాణములఖిలశాస్త్రములు కళలు చాటున నీ వైభవం

వక్రతుండమే ఓంకారమని విభుదులు చేసే నీకీర్తనం

జయ జయ శుభకర వినాయక

శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక

జయ జయ శుభకర వినాయక

శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక

ఆ ఆ ఆ ఆ

First Pujala Vighnaraja Shlokam – మొదటి పూజల విఘ్నరాజ శ్లోకం

 

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే

అగజానన పద్మార్కం గజాననమహర్నిశం

అనేక దం తం భక్తానాం ఏకదంతముపాస్మహే

శ్రీ వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ

నిర్విఘ్నం కురు మే దేవ సర్వ (శుభ) కార్యేషు సర్వదా

గజాననం భూతగణాధిసేవితం కపిత్థం,

జంబు ఫలసార భక్షణం ఉమాసుతం

శోకవినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం

మూషికవాహన మోదకహస్త చామరకర్ణ

విలంబిత సూత్ర పార్వతి నందన

మహేశ్వరపుత్ర విఘ్నవినాయక పాద నమస్తే

Lord Ganesh Song Lyrics Watch Video

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *